ఇదో వంక..డ్వాక్రా రుణాల మాఫీ అంతే ఇక | Sakshi
Sakshi News home page

ఇదో వంక..డ్వాక్రా రుణాల మాఫీ అంతే ఇక

Published Sun, Feb 15 2015 12:43 AM

Chandrababu Cheating Dwaraka loans AP People

 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాల మాఫీ విషయమై శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఈ విషయూన్ని స్పష్టం చేస్తున్నారుు. ఏపీకి చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డ్వాక్రా రుణాల మాఫీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తే మహిళలంతా టీడీపీకి మరింత మద్దతు ఇస్తారని ఆయన చెప్పగా.. ‘ఆర్థిక పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. మెరుగయ్యూక చేద్దాం’ అని చంద్రబాబు బదులిచ్చారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ రుణమాఫీ హామీని ఎప్పటికప్పుడు వారుుదా వేస్తుండటంతో అదే సమావేశంలో పాల్గొన్న కొందరు ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారని సమాచారం. ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అన్నచందంగా.. రుణమాఫీ మాట ఎత్తినప్పడల్లా వంకలు చెబుతూ  చంద్రబాబు దాటవేయడం అన్యాయమని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
 
 మాఫీ కోసం 6.20 లక్షల మంది మహిళల ఎదురుచూపు
 రైతులు తీసుకున్న పంట రుణాలతోపాటు డ్వాక్రా మహిళల రుణాలను సైతం పూర్తిగా మాఫీ చేస్తామని, బ్యాంకులకు ఒక్కపైసా కూడా చెల్లించవద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి జిల్లాలో 6లక్షల 20 వేల మంది డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోసం కళ్లల్లో ఒత్తులు మరీ ఎదురు చూస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక్కొక్క డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష చొప్పున మాత్రమే మాఫీ చేస్తామని చంద్రబాబు మాట మార్చారు. ఈ నేపథ్యంలో కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకైనా మాఫీ అవుతుందని మహిళలు ఎదురు చూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలోనూ మాట మారుస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ రుణమాఫీని దాటవేయడం మహిళలను ఆవేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకులకు వారుుదాలు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోయూయి. అయినా మాఫీ సొమ్ము ఊడిపడటం లేదు. ఈ పరిస్థితిపై డ్వాక్రా మహిళలు ఏమంటున్నారంటే...
 
 మాట మార్చడం బాబుకు కొత్త కాదు
 ఎన్నికల నాటినుంచీ చంద్రబాబు బూటకపు మాటలు చూస్తూనే ఉన్నాం. గెలిచే వరకూ డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు. గెలిచాక కొంతకాలం గ్రూపునకు రూ.లక్ష అన్నారు. ఆ తరువాత గ్రూపు సభ్యులకు వారి ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున వేస్తామన్నారు. ఒక్కపైసా కూడా విదల్చలేదు. వెంటనే డబ్బు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇదేమీ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి అంటున్నారు. ప్రజలను మోసగించడమే చంద్రబాబుకు తెలిసిన విద్య. దీనిని ఐద్వా సంఘం తరఫున అడ్డుకుంటాం. డ్వాక్రా మహిళలతో కలసి ఉద్యమాలు చేపట్టి గట్టి బుద్ధి చెబుతాం .            
 - కె.విజయలక్ష్మి, ఐద్వా నాయకురాలు
 
 మాటమారిస్తే మనుగడ ఉండదు
 చంద్రబాబు అబద్దాలు చెప్పి డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు. గెలిచిన తర్వాత గ్రూపునకు రూ.లక్ష మాఫీ అని మాట మార్చారు. ప్రస్తుతం అదీ లేదంటున్నారు. రుణమాఫీ చేయకుండా మహిళలను మోసగించాలని చూస్తే సహించేది లేదు. మాటమారిస్తే మనుగడ ఉండదని చంద్రబాబు తెలుసుకోవాలి.              
 - అంబటి ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ
 
 మాటల గారడీ
 చేస్తున్నారు
 చంద్రబాబు నాయుడు మాటల గారడీతో మోసగిస్తున్నారు. ఎన్నికల సమయంలో  ఇచ్చిన హమీలకు భిన్నంగా మాటలు మారుస్తూ రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న మహిళలను మభ్యపెడుతున్నారు. ఇది చాలా దారుణం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుని, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలి.
 - వనమా భాగ్యలక్ష్మి, నాయకురాలు, మహిళా సమాఖ్య
 
 దారుణం
 ప్రస్తుతం డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేమనడం అత్యంత దారుణం. ఎన్నికల ముందు రాష్ట్ర ఆదాయాన్ని పరిశీలించకుండానే రుణమాఫీ అని చెప్పారా. గెలిచిన అనంతరం ఆదాయాన్ని పెంచుకునే మార్గం చూసుకోవాలిగానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదనడం సబబు కాదు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదని ఇచ్చిన హామీని గాలికి వదిలి మహిళలను మోసగిస్తే సహించేది లేదు.
 - గంటా రమణ, డ్వాక్రా మహిళ
 

Advertisement
 
Advertisement
 
Advertisement