అడ్డంకులు ఎదురైనా ‘పోలవరం’ ఆగదు | Sakshi
Sakshi News home page

అడ్డంకులు ఎదురైనా ‘పోలవరం’ ఆగదు

Published Sat, Dec 9 2017 1:52 AM

Chandrababu clarification on polavaram - Sakshi

సాక్షి, అమరావతి: అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులకు సూచించారు. చంద్రబాబు శుక్రవారం పోలవరం ప్రాజెక్టుపై విశాఖపట్నం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలీ పని చేస్తామని పలువురు సందేశాలు పంపుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.

రాష్ట్రానికి జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిర్మాణ పనులు చేసే సంస్థల సమస్యలు ప్రాజెక్టుకు శాపంగా మారకూడదని,  ఇదే విషయాన్ని ఆయా సంస్థలకు, కేంద్రానికి తెలియజేశామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారమంతా ఇప్పటికే ఇచ్చామని, మళ్లీ అడిగినా ఇస్తామని ఉద్ఘాటించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ ముందు ఉంచామని, ఇది శ్వేతపత్రం కన్నా ఎక్కువని వ్యాఖ్యానించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement