‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి | Sakshi
Sakshi News home page

‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి

Published Wed, Jan 14 2015 3:59 AM

‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి - Sakshi

సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగ నేపథ్యంలో పంపిణీ చేపిన ఉచిత సరుకులపై విజిలెన్స్‌తో గాని, ముగ్గురు సభ్యులతో కూడిన ఐఏఎస్ అధికారులతో గాని విచారణ జరపాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సరుకుల పంపిణీలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తెలు స్తోందన్నారు. ప్రభుత్వం అందించిన సరుకుల ధరల కన్నా.. స్థానిక, మార్కెట్‌లో ధరలే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అటువంటప్పుడు హోల్‌సేల్ గా కొనుగోలు చేస్తే వాటి ధర మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం ఉచిత సరుకులందిస్తున్నట్టు ప్రకటించిం దని,
 
 అప్పట్లో రూ. 287 కోట్ల అవసరమవుతున్నాయన్నారని, కానీ ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్టు చెబుతున్నారన్నారు. పం డగకు ఉచితంగా సరుకులందించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులైనా.. నాణ్యంగా లేవన్నారు. కొన్నిచోట్ల తక్కువ ధరకు వచ్చే పాలిష్డ్ పప్పు, ఇంకొన్ని చోట్ల నాశిరకంగా ఉందన్నారు. అలాగే 30 కోట్ల రూపాయలతో కొనుగోలుు చేసిన సరుకుల బ్యాగులు ఎక్కడా కానరాలేదన్నారు. మరీ బ్యాగులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. తూకంలో కూడా తగ్గుదల ఉన్నట్టు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన పథకాన్ని... ఎందుకు ఆదరాబాదరాగా చేపట్టాల్సి వచ్చిందో తెలి యడం లేదన్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 సంబరాలకెలా వస్తాం..?;
 ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే తాము సంబరాల్లో ఎలా పాల్గొంటామని రాజ న్నదొర ప్రశ్నించారు. పింఛన్లు పొందేం దుకు అన్ని అర్హతలున్నా అంద కపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది మనో వ్యాధితో మరణిస్తున్నారన్నారు. అధికారుల తప్పి దం వల్ల రాష్ట్రంలో 7 లక్షల కుటుంబా లు, జిల్లాలో 14 వేల కుటుంబాల రేషన్‌కార్డుల ఆధార్‌సీడింగ్ జరగకపోతే వారికి సరుకులు ఇవ్వడం లేదని, రైతుల రుణమాఫీ కూడా సక్ర   మంగా అమలు చేయకపోవడంతో పాటు హుద్‌హుద్ తుపాను పంట నష్ట పరిహారాన్ని కూడా పాత బకాయిలకు బ్యాంకులు జమ చేస్తుంటే రైతులు పండగ ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేదని చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement