రింగ్‌రోడ్డుకు బాలారిష్టాలు | Sakshi
Sakshi News home page

రింగ్‌రోడ్డుకు బాలారిష్టాలు

Published Wed, Aug 28 2013 2:58 AM

chief minister kiran kumar reddy establishing ring road

గద్వాల, న్యూస్‌లైన్: సరిగ్గా రెండేళ్ల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేసిన గద్వాల రింగ్‌రోడ్డు పనులు నేటికీ టెండర్ల దశ దాటడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన రింగ్‌రోడ్డు పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో, ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా అవతరించిన గద్వాల ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు.
 
 రాజీవ్ యువకిరణాలు కార్యక్రమాన్ని మూడు ప్రాంతాల్లో ఒక్కొక్క చోట సీఎం ప్రారంభించారు. అందులో భాగంగా 2011 ఆగస్టు 27న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి యువకిరణాలు కార్యక్రమాన్ని గద్వాలలో ప్రారంభించేందుకు వచ్చి రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మంగళవారంతో శంకుస్థాపన జరిగిన రెండేళ్లు పూర్తయింది.
 
 రూ.40కోట్ల అంచనావ్యయంతో..
 గద్వాల చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్ల అంచనా వ్యయం తో 2011లో ప్రభుత్వం మంజూరు ఇ చ్చింది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జమ్మిచేడు వద్ద నుంచి అయిజ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టాలని మొదట ప్రతిపాదించారు. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ను తెరపైకి తెచ్చారు. దీంతో పనులను రెండు దశలుగా విభజించారు. మొద టి దశ జమ్మిచేడు నుంచి వయా అయి జ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వర కు, రెండో దశలో రాయిచూరు రోడ్డు నుంచి డ్యాం రోడ్డు, నదిఅగ్రహారం రోడ్డు, వెంకంపేట రోడ్డుల ద్వారా జమ్మిచేడు రోడ్డును కలిపేలా నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనాలు రూపొందించారు.
 
 రూ.23.12కోట్ల వ్యయంతో తయారుచేసిన నివేదికను సాంకేతిక అనుమతి కోసం ఈఎన్‌సీకి పంపారు. సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడం, కాంట్రాక్టర్లకు వర్క్‌ఆర్డర్ ఇవ్వడం వంటి దశలను పూర్తి చేసుకోవడం ఎప్పుడో, రోడ్డు నిర్మాణ పనులు ఇంకెన్నాళ్లకు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ గద్వాల డీఈఈ నాగార్జున్‌రావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, సాంకేతిక అనుమతి రాగానే రింగ్‌రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement