తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

25 Dec, 2019 06:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ అమరావతి : తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి నెలకొంది. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్‌ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్‌ శోభ వెల్లివిరుస్తోంది. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్‌ను జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

మెదక్‌ చర్చిలో వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు..
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ చర్చి, విజయవాడ గుణదల చర్చిలలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు