విశ్వ వేడుక క్రిస్మస్ | Sakshi
Sakshi News home page

విశ్వ వేడుక క్రిస్మస్

Published Sat, Dec 21 2013 12:36 AM

Christmas is Universal Festival

సాక్షి, రంగారెడ్డి జిల్లా : క్రిస్మస్ కేవలం క్రైస్తవులకే కాకుండా ప్రపంచంలోని అన్ని మతా ల, జాతుల ప్రజలు జరుపుకొనే పండుగని నామినేటెడ్ ఎమ్మెల్యే క్రిస్టినా లాజరస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ శాఖ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవజాతి యావత్తు ప్రేమతో మసలుకోవాలని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని, ఇదే క్రీస్తు సందేశమన్నారు. ప్రస్తుతం  సమాజంలో ఒకరిపట్ల ఒకరికి ఆదరాభిమానాలు తగ్గిపోతున్నాయని అభిప్రాయపడ్డారు.
 
 క్రిస్టియన్ సోదరులు అనాధలకు, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించాలని సందేశమిచ్చిన మహనీయుడు ఏసుక్రీస్తు అని అన్నారు. జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ మాట్లాడుతూ క్రిస్మస్ త్యాగానికి ప్రతీక అని అన్నారు. జాయింట్ కలెక్టర్-2 ఎంవీరెడ్డి మాట్లాడుతూ జీసస్ ఎంతో సహనంతో, ఓపికతో ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నించారన్నారు. ఈ అలవాట్లను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మత గురువులు, యువతీయువకులు ఏసుక్రీస్తును స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. పాస్టర్లు బైబిల్ సూక్తులను ప్రవచించారు. ఆ తర్వాత క్రిస్మస్ కేకును కట్ చేశారు. కార్యక్రమంలో బిషప్ ఏసురత్నం, పాస్టర్ ఆనంద్, దళిత క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు వరప్రసాద్, స్వర్ణకుమార్, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement