తాయిలాల కోసమే పార్టీ ఫిరాయింపులు | Sakshi
Sakshi News home page

తాయిలాల కోసమే పార్టీ ఫిరాయింపులు

Published Mon, Feb 29 2016 1:10 AM

తాయిలాల కోసమే పార్టీ ఫిరాయింపులు - Sakshi

వలస వె ళ్లిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు    
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 
బెల్లంకొండ: అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చే తాయిలాల కోసమే వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. ఆదివారం మాచాయపాలెం పునరావాస కేంద్రంలో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే ముఖ్యమంత్రి అవినీతి సొమ్మును ఎరగా వేసి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి మీకేమైనా చెప్పారా... అని ప్రశ్నించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన తెలిపారు. గ్రామాల్లో రెండేళ్లు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. జననేత వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు గర్వంగా ఉందన్నారు.వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం కోటానుకోట్లు డబ్బులిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను కరివేపాకులా వాడుకుని చంద్రబాబు వదిలేస్తాడన్నారు. సమావేశంలో పార్టీ నేతలు బాసు లింగారెడ్డి, గజ్జల నాగభూషణ్‌రెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ చెన్నపురెడ్డి పద్మావెంకటేశ్వరరెడ్డి, రాజు పాలెం జెడ్పీటీసీ మర్రి వెంకట్రామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు.     
 

Advertisement

తప్పక చదవండి

Advertisement