YS Jagan on CoronaVirus Crisis: రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.1000 ఇవ్వాలి - Sakshi Telugu
Sakshi News home page

వారందరికి రూ.1000 అందించాలి : సీఎం జగన్‌

Published Tue, Apr 14 2020 2:27 PM

CM Jagan Holds Video Conference With Collectors Over Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి : రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 1000 ఆర్థిక సాయం అందించాలని, ఎవ్వరూ పస్తు ఉండే పరిస్థితి లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అర్హత ఉండి రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా కార్డు అందించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనావైరస్‌ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, రెడ్‌ జోన్స్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌ గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. ఏపీలో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.గ్రామస్థాయిలో మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ జరగాలన్నారు.

వ్యవసాయ పనులకు వెళ్లేప్పుడు భౌతిక దూరకం పాటించేలారైతులకు అవగాహన   కలిగించాలన్నారు.ఎలాంటి ఆరోగ్య పరిస్థితులున్నా వెంటనే పరీక్షలు నిర్వహించాలని,హై రిస్క్‌ ఉన్న కేసులను గుర్తించి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండాలని, సుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు జాగ్రత్తగా వైద్యం అందించాలన్నారు. క్వారంటైన్‌పూర్తయిన వ్యక్తులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. మాస్క్‌లు, పీపీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ఒక రేషన్‌ దుకాణం పరిధిలో రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు గుమికూడకుండా టోకెన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement