చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్

Published Mon, Apr 20 2015 12:18 PM

చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారా ఏచూరికి కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేసి ఏచూరికి అభినందనలు తెలిపారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీల్లో సీపీఎం నిర్మాణాత్మకంగా ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement