‘సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’ :కేటీఆర్ | Sakshi
Sakshi News home page

‘సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’ :కేటీఆర్

Published Fri, Jan 24 2014 12:47 AM

‘సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’ :కేటీఆర్ - Sakshi

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు టీఆర్‌ఎస్ సభ్యుడు తారకరామారావు  (కేటీఆర్) చెప్పారు. గురువారం మధ్యాహ్నం శాసనసభ సమావేశమైనప్పుడు సీఎం కిరణ్ ప్రసంగించడానికి లేవగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ కేటీఆర్  మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రి 2011 ఫిబ్రవరి 22న శాసనసభలో మాట్లాడుతూ.. తెలంగాణ సమస్యపై అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాక కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తానన్నారు. ఇప్పుడు కేంద్రం  పంపించిన బిల్లును వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగా చెప్పడం సభ్యులకు గతంలో ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా మాట్లాడటమే.
 
  అది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. అందువల్ల ముఖ్యమంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడుతున్నాను’’ అని చెప్పారు. అదే విధంగా పార్లమెంట్‌లో జరిగిన ప్రొసీడింగ్స్‌ను సభలో వినిపించాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలని, అలాకాకుండా ఇందిరాగాంధీ, పలువురు ఎంపీల ప్రకటనలను సీఎం ఇక్కడ చదవడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు.

Advertisement
Advertisement