హంద్రీ-నీవా ‘నత్త’లను తప్పించండి! | Sakshi
Sakshi News home page

హంద్రీ-నీవా ‘నత్త’లను తప్పించండి!

Published Sat, Feb 1 2014 3:46 AM

Collection - Final 'snail' and Avoid!

  •     పనులు నిలిపివేసిన ఆరు ఏజెన్సీల రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
  •      ఒక్కొక్కరికి 10 నుంచి 20 నోటీసులిచ్చినా స్పందనలేదు
  •  బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఏవీఆర్ హంద్రీ-నీవా సుజలస్రవంతి సాగునీటి ప్రాజెక్టు పనులు దక్కించుకున్న ఏజెన్సీలు నిర్ణీతగడువులోగా పూర్తిచేయకపోవడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే నోటీసులిచ్చినా ఏజెన్సీల నుంచి కదలిక లేకపోవడంతో పనులరద్దుకే మొగ్గుచూపుతోంది. ఫలితంగా చిత్తూరు జిల్లా మదనపల్లె సర్కిల్ పరిధిలోని ఆరు ప్యాకేజీలకు కొత్తగా టెండర్లు నిర్వహించి పనులు అప్పగించే చర్యలు వేగవంతం చేసింది.

    అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి పరిసరాల్లో ప్రధానకాలువ పనుల్లో భాగంగా సొరంగం(టన్నెల్)పనులు చేయా ల్సి ఉంది. చిత్తూరు జిల్లా పరిధిలో సొరం గం, ప్రధానకాలువ, మదనపల్లె పట్టణానికి మంచినీటిని అందించే సమ్మర్‌స్టోరేజీ ట్యాం కు పనులను పూర్తిచేయాల్సి ఉంది. 2013 నాటికి గడువు పూర్తికావడంతో పనులుపొందిన ఏజెన్సీలు ఏడాదికాలంగా ఎక్కడిపనులను అక్కడే ఆపేశారు.

    ఈ పరిస్థితుల్లో పనులు పూర్తిచేయాల్సిందిగా కోరుతూ ఉన్నతాధికారులు ఏజెన్సీలకు నోటీసులమీద నోటీసులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో చర్యలకు సిద్ధమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏజెన్సీ అనంతపురం జిల్లాలో మూడుసొరంగం ప నులను దక్కించుకొంది. 6వ ప్యాకేజీలో రూ.32.40 కోట్లకు గాను రూ.26.14కోట్ల పనులు, 10వ ప్యాకేజీలో రూ.28.08కోట్ల ప నుల్లో రూ.21.32 కోట్ల పనులు, 15వ ప్యాకేజీలో రూ.27 కోట్ల పనులకు రూ.20.78 కోట్ల పనులు చేశారు.

    మిగిలిన పనులను చేపట్టలేదు.పెద్దమండ్యం మండల పరిధిలోని 20వ ప్యాకేజీలోని రూ.47.70 కోట్ల సొరంగ పనుల్లో రూ.18.48కోట్ల పనులే సాగాయి. 26వ ప్యాకేజీలో పుంగనూరు బ్రాంచ్‌కెనాల్ పనులు రూ.73.99 కోట్లతో పూర్తిచేయాల్సి ఉంది. ఇందులో రూ.42.44కోట్ల పనులు పూర్తిచేశారు. మదనపల్లె సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నిర్మాణపనులు ఆగిపోయాయి. 59వ ప్యాకేజీలో ఈ పనులను రూ.69.91కోట్లతో చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణసంస్థ పనులు దక్కించుకుంది.

    ప్రారంభంలో పనులు ముమ్మరంగా సాగినా..తర్వాత మందగించాయి. ప్రస్తుతానికి రూ.30.99 కోట్ల పనులే పూర్తిచేశారు. దీనిపై అధికారులు పనులు పూర్తి చేయాలంటూ నోటీసులు ఇస్తూనేవచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివర్లో ప్రభుత్వం ఈ పనులపై ఆదేశాలిచ్చింది. ప్రస్తుత ఏజెన్సీలను తప్పిం చి, కొత్త ఏజెన్సీలకు పనులను అప్పగించేందుకు సూచనలిచ్చింది.  దీంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు ప్రస్తుత ధరల ప్రకారం అంచనాలు రూపొందిస్తున్నారు. అంచనాలు సిద్ధంకాగానే ఏజెన్సీల కాంట్రాక్టును రద్దుచేసి టెండర్లు పిలవనున్నారు.
     
    చర్యలు చేపట్టాం
     
    పనులు ఆపేసిన ఆరు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిలిపివేసిన పనులకు ఎంత నిధులు అవసరం అన్నదానిపై ప్రతిపాదనలకు చర్యలు తీసుకుంటున్నాం. పనులుచేపట్టని ఏజెన్సీలపై చర్యలూ ఉంటాయి.
     -పీ.కృష్ణ, ఎస్‌ఈ, మదనపల్లె సర్కిల్
     

Advertisement
Advertisement