‘అనంత ఎక్స్‌ప్రెస్‌ వే’ ఖరారుకు కమిటీ | Sakshi
Sakshi News home page

‘అనంత ఎక్స్‌ప్రెస్‌ వే’ ఖరారుకు కమిటీ

Published Tue, Dec 20 2016 4:50 AM

‘అనంత ఎక్స్‌ప్రెస్‌ వే’ ఖరారుకు కమిటీ - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి అనంతపురానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌ ఖరారుకు, భూ సేకరణకు సీఎం చంద్రబాబు నాయుడు ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో 16 మంది సభ్యులతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూ రు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.

అమరావతి– అనంత గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (కడప–కర్నూలు జిల్లాలు కలుపుతూ) ప్రాజెక్టుపై నవంబరు నెలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమీక్ష చేసినప్పుడు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టుకు నియమించిన కన్సల్టెంట్లు టెక్నో ఎకనమిక్‌ ఫీజిబిలిటీ అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా, మెంబర్‌ కన్వీనర్‌గా రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ), ఆర్ధిక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులను కమిటీలో చేర్చారు.

30 నుంచి స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు..
పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను ఈ నెల 30 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రాజెక్టు పనులను వర్చువల్‌ ఇన్స్‌పెక్షన్‌ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు.

Advertisement
Advertisement