కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్‌

21 Apr, 2020 19:56 IST|Sakshi

కరోనా కోరల్లో చిక్కుకొని ప్రతి ఒక్కరు విలవిలలాడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావడంతో పనులు లేక రోజువారీ కూలీలు, పేదల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజూ కూలీ చేస్తే కానీ పూటగడవని వారి జీవితాలు లాక్‌డౌన్‌ కారణంగా చిన్నభిన్నమవుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. సొంత ఊరికి వెళ్లలేక ఉన్నచోట ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. చేయూతనందిచే వారి కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో చాలా మంది సామాన్యులు సైతం తమకి తోచినంత సాయం చేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు.

(వలస కార్మికులకు వీహెచ్పీ చేయూత)


కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న హరగోవింద్‌ ఖొరానా రెడ్డి 1100 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం, రెండు కేజీల కూరగాయలు, ఆయిల్‌ ప్యాకెట్‌, పండ్లు అందజేశారు. 

అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే డా సిద్ధారెడ్డి గారి పిలుపు మేరకు  రాచవారిపల్లి తాండాలో పేద ప్రజలకు గ్రామ ఎంప్లాయీస్,  పట్నం యమ్‌పీటీసీ అభ్యర్థి బి.ఆనంద్ నాయక్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేశారు. (సేవ సైనికులు)

కరోనా కారణగా ఇంటికే పరిమితమయ్యి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదకుటుంబాలకు బెల్లంపల్లిలో ఆర్‌ శ్రీనివాస్‌ తన బృందంతో కలిసి నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. 

అలహాబాద్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ వారు వరంగల్‌ కరీమాబాద్‌లో ఉంటున్న పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కాశీ విశ్వనాధ్‌, రమాదేవి, దామోదర్‌, శ్రీనివాస్‌, శివ, ప్రసన్నకుమార్‌ పాల్లొన్నారు. ప్రతి కుటుంబానికి రెండు కేజీల బియ్యం, అరకిలో నూనె, ఒక కిలో పప్పు అందించారు. 

మీరు కూడా ఇలా మీరు చేస్తున్న సాయాన్ని పదిమందికి తెలిపి వారిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే Webeditor@sakshi.comకి మీరు చేస్తున్న సేవ కార్యక్రమాల వివరాలు పంపండి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు