ఎంసెట్ మెరుపులు | Sakshi
Sakshi News home page

ఎంసెట్ మెరుపులు

Published Tue, Jun 10 2014 12:33 AM

ఎంసెట్ మెరుపులు - Sakshi

  •      ఇంజినీరింగ్‌లో 5వ ర్యాంకు సాధించిన విష్ణువర్థన్
  •      మెడిసిన్‌లో శ్రీవిద్యకు 7వ ర్యాంక్
  •      500లోపు 29మందికి ఇంజినీరింగ్ ర్యాంకులు
  •      మెడిసిన్‌లో 28మందికి ఉత్తమ ర్యాంకులు
  •  విశాఖపట్నం : పోటీ పరీక్షల్లో  నగర విద్యార్థులు దూసుకుపోతున్నారు. పరీక్షలేవైనా తమకు సాటి లేదని రుజువు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ హవా కొనసాగించిన విద్యార్ధులు సోమవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో ముందంజలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి నగర కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర 5వ ర్యాంకు, మెడిసిన్ విభాగంలో 7వ ర్యాంక్ నగరానికే వరించాయి.

    ఇంజినీరింగ్ విభాగంలో వందలోపు 4 ర్యాంకులు, 500 లోపు 29 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. మెడిసిన్ విభాగంలో వంద లోపు ఏడుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. 500 లోపు ర్యాంకులను 28 మంది విద్యార్ధులు సాధించారు. శ్రీైచె తన్య నారాయణ ఐఐటీ అకాడమీ విద్యార్థి వి.విష్ణువర్థన్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర 5వ ర్యాంక్, మెడిసిన్ విభాగంలో నారాయణ శ్రీచైతన్య మెడికల్ అకాడమి విద్యార్థిని పి. శ్రీవిద్య రాష్ట్ర 7వ ర్యాంక్ సాధించింది.

    మే 22న నగరంలోని 36 కేంద్రాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో 17,809 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 16వేల మంది కి సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. 13 కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ విభాగంలో 5956 మంది పరీక్షలు రాశారు. వీరిలో 800 మంది మెడిసిన్ సీట్లు సాధించే అవకాశం ఉంది.
     
    అభిషేక్‌కు మెడిసిన్‌లో 15వ ర్యాంకు
     
    నర్సీపట్నం : నర్సీపట్నం విద్యార్థి మంత్రి వెంకటరత్న అభిషేక్ మెడిసిన్‌లో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. స్థానిక తురకబడి హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.ఎస్.ప్రసాద్ కుమారుడైన అభిషేక్  ఇంటర్ విజయవాడ, చైతన్య గోశాలలో చదివాడు. తల్లి రాధాకుమారి మాకవరపాలెం పీహెచ్‌సీలో పార్మసిస్టుగా పనిచేస్తున్నారు. స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీలో చదివిన లోకవరపు సతీష్ మెడిసిన్‌లో 2989 ర్యాంకు సాధించాడు.
     
    నిద్ర హనూక్ అభిషేక్‌కు 151 ర్యాంకు
    నర్సీపట్నం : కొత్త బైపురెడ్డిపాలెంనకు చెందిన నిద్ర హనూక్ అభిషేక్ మెడిసిన్‌లో 151 ర్యాంకు సాధించాడు. అభిషేక్ తండ్రి సత్తిబాబు గొలుగొండ మండలం కొత్త యల్లవరం  జడ్‌పీ స్కూలులో స్కూ లు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.  
     
    జ్యోతిర్మయికి మెడిసిన్‌లో 136వ ర్యాంక్
    మునగపాక : మునగపాక గ్రామానికి చెందిన విద్యార్థిని జ్యోతిర్మయి మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 136వ ర్యాంక్ సాధించింది. గ్రామానికి చెందిన మళ్ల రామజోగి అప్పారావు, విజయ దంపతులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. జ్యోతిర్మయి పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదువుకుంది. విజయవాడలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంది.
     
     ఐఐటీ ధ్యేయం
     కష్టపడి చదివినందుకు మంచి ఫలితం వచ్చిం ది. 5వ ర్యాంక్ సాధిం చడం వెనుక అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఐఐటీలో సీటు సాధించాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాను.              
     - వి.ఆదిత్యవర్థన్, శ్రీచైతన్య నారాయణ అకాడమీ
     
     డాక్టరుగా సేవలందిస్తా..
     డాక్టర్‌గా సేవలందిం చాలని కష్టపడి ఎంసెట్ మెడిసిన్‌కు సాధన చేశాను. రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సహం వల్లే ర్యాంక్ తెచ్చుకోగలిగాను.
     -పి.శ్రీవిద్య, నారాయణశ్రీచైతన్య అకాడమీ
     

Advertisement
Advertisement