సమగ్ర సమాచారం ముఖ్యం | Sakshi
Sakshi News home page

సమగ్ర సమాచారం ముఖ్యం

Published Tue, Sep 30 2014 2:14 AM

Comprehensive information is important

  • ప్రజావాణిలో ఏజేసీ చెన్నకేశవరావు
  • చిలకలపూడి(మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్.చెన్న కేశవరావు సూచించారు. కలెక్టరేట్‌లోని సమా వేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ  అధికారులంతా ప్రజావాణిలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే స్పందించాలని కోరారు. మత్స్యశాఖ డీడీ     టి.కళ్యాణం, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవివి. సత్యనారాయణ, డీఎస్‌వో పిబి.సంధ్యారాణి, బీసీ సంక్షేమాధికారి లక్ష్మీదుర్గ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మారుతీదివాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

    అర్జీలు ఇవే :
    బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామంలో  రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
     
    గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రహరీగోడ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యంషాపును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కూనపరెడ్డి పాండు రంగారావు వినతి పత్రమిచ్చారు.
     
    ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని ప్రభుత్వం    పునరుద్ధరించాలని   గ్రామ సర్పంచి డొక్కు లక్ష్మి అర్జీ ఇచ్చారు.
     
    బందరు మండలం మంగినపూడి పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు సంచరిస్తే జరి  మానాలు విధిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు  జి.వాకాలయ్య వినతిపత్రం అందించారు.
     
    మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగం అవ్వకుండా... సబ్‌ప్లాన్ అమలు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్‌హుస్సేన్, దాదాసాహెబ్, షేక్ రబ్బాని  అర్జీ ఇచ్చారు.
     
    సాంఘిక సంక్షేమశాఖ  వసతి గృహాల్లోని విద్యార్థులకు జొన్న బిస్కట్లు, జొన్నతో తయారు చేసిన ఇడ్లీ, జొన్నతో తయారు చేసిన అన్నం ప్రభుత్వ ఖర్చులతో అందించాలని ప్రముఖ న్యాయవాది కంచర్లపల్లి శివప్రసాద్ వినతి పత్రమిచ్చారు.
     
    సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లకు నియామక పత్రాలు ఇచ్చి, బకాయిలు చెల్లించాలని ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు  సీహెచ్‌ఎన్.దేవేంద్రరావు అర్జీ ఇచ్చారు.
     
    రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రైతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు జారీ చేసిన జీవో నెంబరు 421ను జిల్లాలోని ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు అమలు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ వినతి పత్రం సమర్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement