గోవర్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు | Sakshi
Sakshi News home page

గోవర్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు

Published Mon, Sep 22 2014 2:39 AM

గోవర్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు

కడప ఎడ్యుకేషన్:
 యోగివేమన యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్‌ను కులం పేరుతో దూ షించి, కడప నగరానికి వస్తే చంపేస్తామని బెదిరించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, బసవతారక లా కాలేజీ కరస్పాండెంట్ గోవర్దన్‌రెడ్డిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని దళిత, ఇతర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివా రం వారు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖడించారు. లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు యూనివర్సిటీ అధికారులు ఈనెల 17వ తేదీన ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఆయన ఇంతవరకూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసును ఇంతవరకూ పెండ్లిమర్రికి బదిలీ చేయలేదన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న దళిత ఉద్యోగిపై ఇంత జరిగినా పోలీ సులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.    ఇప్పటికైనా ఎస్పీ స్పందించి యూనివర్సీటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదును వెంటనే ఎఫ్‌ఐఆర్ చేసి పెండ్లిమర్రికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గోవర్ధన్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయకపోతే జిల్లాలోని అన్ని దళిత సంఘాలను కూడగలుపుకుని ఆందోళను చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదుట అందోళన నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కేసీ లక్షుమయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లుగారి వెంకటసుబ్బయ్య, బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓబయ్య, వీఆర్‌ఏ అసోసియేట్ జిల్లా జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, అడ్వకేట్ శేషయ్య, డీఎంఎఫ్ సంగటి మనోహర్, రాయలసీమ ఎస్సీ,ఎస్టీ హ్యూమన్‌రైట్స్ అధ్యక్షుడు జేవీ రమణ, బీసీ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, అంబేద్కర్ మిషన్ ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, యాదవ కమ్యూనిటీ  వెల్ఫేర్ అసోసియేట్ అధ్యక్షుడు నారాయణయాదవ్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య జయన్న, జోనస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పిచ్చయ్య ప్రొఫెసర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.,


 

Advertisement

తప్పక చదవండి

Advertisement