ఉదయం పాస్‌.. సాయంత్రానికి ఫెయిల్‌

3 Apr, 2018 09:18 IST|Sakshi
యూనివర్శిటీ నిర్వాకంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

ఎస్కేయూ ఫలితాల్లోగందరగోళం

టవరెక్కి విద్యార్థుల నిరసన

కదిరి: ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విద్యార్థులను అయోమయంలో పడేశాయి. సోమవారం డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా ఉదయం ఉత్తీర్ణులైనట్లు చూపించిన ఫలితాలు... సాయంత్రంలోపు మారిపోయి ఫెయిల్‌ అయినట్లు చూపించాయి. ఇందుకు నిరసనగా డిగ్రీ విద్యార్థులు స్థానిక వేమారెడ్డి కూడిలి సమీపంలో కదిరి–హిందూపురం రహదారిపై రాత్రి సమయంలో గంటపాటు  బైఠాయించారు. అదే సమయంలో అశోక్, అజయ్, ప్రతీష్, రవితేజ, త్యాగి, శ్రీకాంత్‌ అనే ఐదురుగు డిగ్రీ విద్యార్థులు అక్కడే సమీపంలోని సెల్‌ టవర్‌ ఎక్కి దూకేస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. 

విద్యార్థులు రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అక్కడి నుంచి టవర్‌ దగ్గరకు చేరుకుని టవర్‌పైకి ఎక్కిన విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారు దిగేలా చేశారు.

మరిన్ని వార్తలు