జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం

17 Mar, 2017 18:31 IST|Sakshi
జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మార్చి 17న  ఇందిరాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌/కార్పొరేషన్‌, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది.
 
జిల్లా పేరు                             పరిశీలకులు
 
1. విజయనగరం       ---          ద్రోణం రాజు శ్రీనివాస్‌(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
2. విశాఖపట్నం       ---            ఎస్‌.ఎన్‌.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
3. తూర్పు గోదావరి    ---        పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
4. పశ్చిమ గోదావరి    ---        నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
5. కృష్ణా                ----         సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌)
6. గుంటూరు         ----           కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)
7. నెల్లూరు           -----            మస్తాన్‌వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
8. చిత్తూరు          ------           డాక్టర్‌ సాకె శైలజానాధ్‌ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)
9. కడప              -----             షాజహన్‌ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
10. కర్నూలు       -----             డాక్టర్‌ ఎన్‌. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)
11. అనంతపురం   ------        అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు