బ్రిడ్జిపైనుంచి పడి కానిస్టేబుల్ మృతి

19 Dec, 2015 08:42 IST|Sakshi

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఉప్పవంక వద్ద విధినిర్వహణలో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సుధాకర్(50) బ్రిడ్జిపైనుంచి ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. ఉదయం బ్రిడ్జి కింద శవం పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా