సీఎం సహాయనిధికి విరాళాలు | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు

Published Wed, Apr 22 2020 4:18 AM

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంఘాలు, పలువురు ప్రముఖులు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. 

► కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు  
► ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.7,77,979  
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) తరఫున రూ.1.16 కోట్లు, ఆ సంస్థ ఉద్యోగుల తరఫున రూ.4,32,506 
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (ఏపీ మార్క్‌ ఫెడ్‌) రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.1,07,000 
► ఏపీ ఆయిల్‌ సీడ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఆయిల్‌ ఫెడ్‌) రూ.50 లక్షలు, ఉద్యోగుల ఒక రోజు విరాళం రూ.1,86,936  
► మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు రూ.50,66,000 
► శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌రూ.30,11,000, శ్రీకాకుళం జిల్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల తరపున రూ.30 లక్షలు 
► వైఎస్సార్‌ జిల్లా కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం రూ.2 లక్షలు  

Advertisement

తప్పక చదవండి

Advertisement