చట్టం చేయలేనిది సంస్కారం చేస్తుంది: జస్టిస్ నర్సింహారెడ్డి | Sakshi
Sakshi News home page

చట్టం చేయలేనిది సంస్కారం చేస్తుంది: జస్టిస్ నర్సింహారెడ్డి

Published Thu, Aug 21 2014 12:36 AM

చట్టం చేయలేనిది సంస్కారం చేస్తుంది: జస్టిస్ నర్సింహారెడ్డి

హైదరాబాద్:  స్త్రీలను గౌరవించే చోట సిరిసంపదలు తుల తూగుతాయని, మహిళలు, చిన్నారుల పట్ల బాధ్యతను పెంపొందించుకున్నప్పుడు మహోన్నత సమాజం ఆవిష్కృతమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి అన్నారు. చట్టం చేయలేని పనులు సందర్భాల్లో సంస్కారం చేస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

బుధవారం నారాయణగూడ కేశవ మెమోరియల్ విద్యాసంస్థలకు చెందిన ప్రకాశం హాలులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ప్రకాశం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్(ట్రస్టు) తదితర సంస్థల ఆధ్వర్యంలో ‘‘స్త్రీలు, చిన్న పిల్లలపై సమాజం బాధ్యత’’  అంశంపై జరిగిన సదస్సులో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణితో కలిసి జస్టిస్ నర్సిం హారెడ్డి పాల్గొని ప్రసంగించారు. న్యాయం జరిగేందుకు అవకాశం ఉన్నా కొన్ని సాంకేతిక అంశాల వల్ల కోర్టులకు వెళ్లలేని బాధితుల వద్దకు వెళ్లి న్యాయం అందించేందుకు లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేస్తోందని ఆయన వివరించారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement