తొలి ఈత 12.12.12.. మలి ఈత 11.12.13న | Sakshi
Sakshi News home page

తొలి ఈత 12.12.12.. మలి ఈత 11.12.13న

Published Thu, Dec 12 2013 12:54 AM

తొలి ఈత 12.12.12.. మలి ఈత 11.12.13న

ప్రత్యేకత కలిగిన సమయంలో, మంచిదని తాము పరిగణించే ముహూర్తంలో తమ బిడ్డలు పుట్టాలన్న తాపత్రయంతో కొందరు తల్లిదండ్రులు ‘సిజేరియన్’ ఆపరేషన్ల ద్వారా కాలాన్ని గుప్పెట్లోకి తీసుకుంటున్న కాలమిది. అలాంటి వారి దారిలో తానూ నడవాలని మోజుపడ్డట్టు.. తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఓ ఆవు  ప్రత్యేకత కలిగిన తేదీల్లోనే తన తొలి, మలి ఈతలను ఈనింది. యెరుబండి కనకదుర్గ సుబ్బరామారావు(రాంబాబు) ఇంట పెరిగిన ఆ ఆవు తొలిచూలులో 12.12.12 తేదీన పెయ్యదూడను ఈనింది. తిరిగి ఎదకు వచ్చిన ఆ ఆవు మలి చూలులో 11.12.13 తేదీన 11 గంటలకు పెయ్యదూడను ఈనింది. తన ఆవు ఇలా వరుసగా రెండు ఈతలనూ ప్రత్యేకత ఉన్న తేదీల్లో ఈనడంతో రాంబాబు మురిసిపోతున్నారు.     

-న్యూస్‌లైన్, ఉప్పలగుప్తం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement