ఇంటికో ఉద్యోగం ఎక్కడ బాబూ..? | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఎక్కడ బాబూ..?

Published Sat, Nov 4 2017 4:18 PM

CPI district secretary madhu fire on CM Chandrababu Naidu

కోటగుమ్మం (రాజమహేంద్రవరం): విద్య, వైద్యం వ్యాపారంగా మార్చి అంగడి సరుకుగా అమ్మడం దారుణమనని, విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం యువత ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక అంబళ్ళ సూర్యారావు భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. విద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు తీసుకువెళుతున్నారని విమర్శించారు. ఇటువంటి తరుణంలో విద్యార్ధి, యువజనుల పోరాటాల ద్వారానే తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని దుయ్యబట్టారు.

 రూ. 2 వేల నిరుద్యోగ భృతి సంగతి ఎప్పుడో మరచిపోయారన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో చట్టాలు చేయాలని, అశ్లీల చిత్రాలపై నిషేధం విధించాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నాయకులు వంగమూడి కొండలరావు, కరిబెండి శ్రీనివాస్, వీసరపు రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక...: సమావేశం అనంతరం నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా గంటా జాన్‌ప్ర కాష్, ఎఐవైఎఫ్‌ జిల్లాఅధ్యక్షుడిగా అప్పారావునుఎన్నుకున్నారు. 

Advertisement
Advertisement