'ప్రభుత్వ భూమి ఆక్రమించిన బొజ్జల అనుచరుడు' | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ భూమి ఆక్రమించిన బొజ్జల అనుచరుడు'

Published Tue, Sep 30 2014 5:10 PM

'ప్రభుత్వ భూమి ఆక్రమించిన బొజ్జల అనుచరుడు' - Sakshi

శ్రీకాళహస్తి: ‘మంత్రిగారూ.. మీ నియోజకవర్గంలో భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. మీ అనుచరులే కబ్జాచేసి ఇతరులకు లీజుకిస్తున్నారు.’ అంటూ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలపై సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో భూసదస్సు నిర్వహించా రు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు భూదాహంతో పరితపించిపోతున్నారన్నారు. మంత్రి బొజ్జల అనుచరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వాసులకు లీజుకివ్వడం సిగ్గుచేటన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం, సత్యవేడు మండ లాల్లోని ప్రభుత్వ భూములను ఆయా మండలాల నాయకులు ఆక్రమించి తమిళనాడు వాసులకు విక్రయిస్తున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement