Sakshi News home page

‘అసెంబ్లీ ముగిసేలోపు ప్రభుత్వం స్పందించాలి‘

Published Tue, Mar 13 2018 2:06 PM

Cpm madhu slms AP government - Sakshi

సాక్షి, ఒంగోలు: ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద సీపీఎం నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ విధాలా వెనుకబడిన ప్రకాశం జిల్లాను ప్రభుత్వం ఆదుకోకుండా, అడిగిన వారిపై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి సీపీఎం నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం స్పందించి ప్రకాశం ను వెనుకబడిన జిల్లాగా గుర్తించి.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement