సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

Published Mon, Dec 22 2014 4:49 PM

సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం - Sakshi

హైదరాబాద్: సీఆర్‌డీఏ బిల్లును సోమవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలతో వాయిదాపడిన సభ తిరిగి ప్రారంభమయ్యాక.. సీఆర్డీఏ బిల్లు సభలో చర్చకు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమైన అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.

 

తెలుగు జాతి గర్వ పడేలా రాజధాని ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆరు నెలల్లో ఉచితంగా సింగపూర్ అధికారులు రాజధాని ప్లాన్ తయారు చేస్తామని చెప్పినట్లు నారాయణ తెలిపారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందని నారాయణ అన్నారు. భూసమీకరణకు ప్రత్యేక ప్రొవిజన్ ఉంటుందని.. భూమి అప్పగించిన 9 నెలల్లోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్ లను రైతులకు త్వరలోనే అందజేస్తామన్నారు.

Advertisement
Advertisement