రాజధాని నిధుల సమీకరణకు ప్రణాళిక | Sakshi
Sakshi News home page

రాజధాని నిధుల సమీకరణకు ప్రణాళిక

Published Thu, Nov 24 2016 2:29 AM

రాజధాని నిధుల సమీకరణకు ప్రణాళిక - Sakshi

సీఎం సమీక్షలో  సీఆర్‌డీఏ కమిషనర్ వెల్లడి
 
 సాక్షి, అమరావతి:
రాజధాని అమరావతి నిర్మాణానికి ఐదు మార్గాల్లో నిధులు సమీకరించాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా నిధుల సేకరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు రాజధాని వ్యవహారాలపై నిర్వహించిన సమీక్షా సమావే శంలో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ వాటిని వివరించారు. తాజా అంచనాల ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.58 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో 32 వేల కోట్లను వచ్చే మూడేళ్లలో మౌలిక సదుపా యాల కల్పనకు ఖర్చు చేయాల్సివున్న నేపథ్యంలో ఈ నిధుల సమీకరణ ప్రణాళికను తయారు చేసినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో ఈ నెల 25న అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్ టేబుల్ పేరుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి వెలగపూడిలోని తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తానని చెప్పారు.

 11 ‘మున్సిపల్స్’లో రోడ్ల మరమ్మతులు  
 ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జరగాల్సిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలను వీలైనంత మేర జాప్యం చేయాలని, ఈలోగా వాటిల్లో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణరుుంచారు. ఆయన బుధవారం ప్రత్యేకం గా రహదారులు-భవనాలు, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న ‘మున్సిపల్స్’లో రహదారులు వెడల్పు చేయడం, మరమ్మతులు చేయడంపైనే దృష్టి సారించాలని రహదారులు, భవనాల శాఖ అధికారుల్ని ఆదేశించారు. అంతేగాక తక్షణం రహదారుల పనులను ప్రారంభించాలని సూచించారు.

 సచివాలయంలో సైకిల్ ట్రాక్  
 వెలగపూడిలోని సచివాలయంలో ప్రయోగాత్మంగా సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఆలిండియా సైక్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ డీవీ మనోహర్ తెలిపారు. బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటుపై సీఎం సమక్షంలో ఫెడరేషన్, సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకుంది.

 9న దుబాయ్‌కు సీఎం : చంద్రబాబు వచ్చే నెల 9 నుంచి మూడు రోజుల పాటు దుబాయ్‌లో ఉండనున్నారు. రాష్ట్రప్రభుత్వంలోని ఉన్నతాధికారి బంధువు దుబాయ్‌లో ప్రముఖ ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆ ఆడిటర్ దగ్గరకు సీఎం వెళ్లనున్నారు. అనంతరం అక్కడ తెలుగు వారు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతస్థారుు వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement