సీఆర్‌డీఏకు నిరుద్యోగుల టెన్షన్ | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీఏకు నిరుద్యోగుల టెన్షన్

Published Mon, Feb 1 2016 9:38 AM

CRDA Officials Under the pressure

రాజధాని గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామనే హామీ నెరవేర్చకపోవడం సీఆర్‌డీఏకు ఇబ్బందికరంగా మారింది. నిరుద్యోగులు వరుస ఆందోళనలకు దిగుతుండడం, ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో మధ్యలో అధికారులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి తట్టుకోలేక ఈ వ్యవహారా లు పర్యవేక్షించే సీఆర్‌డీఏ డెరైక్టర్ జయదీప్ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేయడం సీఆర్‌డీఏలో కలకలం రేపింది.

రాజధాని యువతకు ఉ ద్యోగాలిప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, నేతలు మొదట్లో ఎడాపెడా హామీలిచ్చారు. సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి 26 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని లెక్క తేల్చినా అంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదని చెప్పి ఆరు వేల మందే అర్హత సాధించినట్లు అప్పట్లో ప్రకటించారు. తొలి దశలో డిగ్రీ, పీజీలు చేసిన 110 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారు.

నిరుద్యోగులను అర్హతలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే శిక్ష ణ ఇవ్వడంతో కొందరు వెనక్కి వచ్చేశారు. చివరకు 96 మందికి శిక్షణ పూర్తయిందనిపించి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలిప్పించేందుకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారుల ఒత్తిడితో మంగళగిరిలో ఏర్పాటుకాబోయే పైడేటా సెంటర్‌లో కొందరికి ఆఫర్ లెటర్లు వచ్చినా ఉద్యోగాలు మాత్రం రాలేదు.  


 ఆందోళనలతో అధికారులపై ఒత్తిడి..
 ప్రభుత్వం ఇష్టానుసారం హామీలిచ్చి వాటిని అమలు చేసే బాధ్యత సీఆర్‌డీఏ అధికారులపై నెడుతుండడంతో వారిపై ఒత్తిడి పెరిగిపోయింది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు నిత్యం సీఆర్‌డీఏ కార్యాలయాల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఈ టెన్షన్ తట్టుకోలేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన సీఆర్‌డీఏ డెరైక్టర్ జయదీప్ నాలుగురోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ప్రభుత్వం సహకరించకుండా తన ఒక్కడి వల్లా ఇంత మందికి ఉద్యోగాలు ఎవరిస్తారని ఆయన వాపోతున్నట్లు తెలి సింది. ఆయన రాజీనామాను ఆమోదించకుండా పనిచేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ సూచిం చినట్లు సమాచారం. జయదీప్ రాజీనామాతో సీఆర్‌డీఏలో ఉద్యోగం ఎంత క్లిష్టతరంగా మారిందో బయటకు వెల్లడైంది. ఇప్పటికే పలు విభాగాల్లో చేరిన డెరైక్టర్లు ఒత్తిడి, ఇబ్బందులు భరించలేక వెనక్కు వెళ్లిపోయారు. మరికొంత మంది ఇదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement