తీవ్ర తుపానుగా బుల్‌బుల్‌ | Sakshi
Sakshi News home page

తీవ్ర తుపానుగా బుల్‌బుల్‌

Published Fri, Nov 8 2019 4:56 AM

Cyclone Bulbul Gathers Intensity Over Boy of Bengal - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్‌బుల్‌.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

బుల్‌బుల్‌ తీవ్రరూపం దాలుస్తున్నందున విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక, కాకినాడ, గంగవరం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్నందున మత్స్యకారులెవరూ శుక్రవారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.


 

Advertisement
Advertisement