గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం | Sakshi
Sakshi News home page

గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం

Published Wed, Jan 22 2014 5:17 PM

Damodara Rajanarasimha talks with Mahanti on Extension to the deadline

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడించే విషయంపై ఈ రాత్రికి గాని లేక రేపు ఉదయం గానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫోన్లో మాట్లాడారు. గడువు పెంపు విషయమై ఆరా తీశారు. ఈ రాత్రికి గాని రేపు గాని నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మహంతి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

చర్చకు మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖను హొం శాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి న్యాయసలహా కోరినట్లు హోంశాఖ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శివశంకర్  గడువు పెంపుపై కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు.

Advertisement
Advertisement