దాసరి కుటుంబానికి పరాభవం | Sakshi
Sakshi News home page

దాసరి కుటుంబానికి పరాభవం

Published Sun, Apr 13 2014 2:25 AM

దాసరి కుటుంబానికి పరాభవం - Sakshi

  •  వంశీకి దక్కిన టికెట్
  •  సిట్టింగ్‌కు మొండి చెయ్యి
  •  కరివేపాకులా వాడుకున్నారని ఆవేదన
  •  దాసరి వర్గీయుల్లో ఆగ్రహం
  •  సాక్షి, విజయవాడ :గన్నవరం ఎమ్మెల్యే దాసరిబాలవర్ధనరావుకు కాకుండా వల్లభనేని వంశీమోహన్‌కు గన్నవరం అసెంబ్లీ సీటును  కేటాయించడంపై పార్టీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీనే అంటిపెట్టుకున్న ‘దాసరి’ కుటుంబానికి జరిగిన పరాభవంగా గన్నవరం వాసులు భావిస్తున్నారు. చంద్రబాబుకు గత ముఫై ఏళ్లుగా విజయా ఎలక్ట్రికల్ అధినేత దాసరి జైరమేష్‌కు సాన్నిహిత్యం ఉంది.పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అనేకమార్లు ఆదుకున్నారు.

    సుజనాచౌదరి, సీఎం రమేష్, నామానాగేశ్వరరావు వంటి  పారిశ్రామిక వేత్తలు టీడీపీలోకి రానిరోజుల్లోనే  దాసరి జై రమేష్ టీడీపీకి అంగబలం, అర్ధబలం సమకూర్చేవారు.  అలాగే కాంగ్రెస్ హవా ఉన్న రోజుల్లోనూ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా దాసరి బాలవర్ధనరావు  గెలుపొందారు. అయినప్పటికీ చంద్రబాబు దాసరిబాలవర్ధనరావుకు ఇవ్వకుండా వంశీమోహన్‌కు ఇవ్వడంపై దాసరి వర్గీయులు త్రీవ ఆగహంతో ఉన్నారు. దాసరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు కరిపేపాకులాగా వాడుకుని వదిలివేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి, చంద్రబాబుకు  ప్రజలే తగిన బుద్ధిచెబుతార నే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
     
    సిట్టింగ్  ఎమ్మెల్యేని కాదని......
     
    దాసరి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు అతనిపై ఏ విధమైన ఆరోపణలు లేవు. ఆయన ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. అలాగే చక్కటి పాలోయింగ్ ఉంది. అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయన్ను పక్కన పెట్టి వంశీమోహన్‌కు ఇవ్వడంలో చంద్రబాబు ఆంత్యరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ అందరిని కలుపుకుని పోయే వ్యక్తికి సీటు ఇవ్వకుండా గ్రూపు రాజకీయాలు చేయడం, దుందుడుకుగా వ్యవహరించే  వంశీకి సీటు ఇవ్వడం ఏమిమీటంటూ సీని యర్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులుతో వంశీకి ఉన్న విభేదాలను ఈసందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.
     
    చైర్మన్ గిరితో సరా...!
     
    కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(విజయా డైరీ) డెరైక్టర్‌గా దాసరి బాలవర్ధనరావు ఇటీవల ఎన్నికయ్యారు. డైరీ చైర్మన్ మండవ జానకీరామయ్య కరుణించి తన పదవి నుంచి  తప్పుకుంటే చైర్మన్ దాసరికి దక్కే అవకాశం ఉంది.
     
    లేకపోతే కేవలం డెరైక్టర్ గిరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రెండు సార్లు మ్మెల్యేగా గెలిచి, పార్టీకి వెన్ను దన్నుగా ఉంటే కుటుంబానికి జరిగిన పరాభవంపై కృష్ణాజిల్లాలో చర్చనీయాశంగా మారింది. చంద్రబాబు యూజ్‌అండ్ త్రో పాలనీని మరోసారి ప్రయోగించారని రాబోయే రోజుల్లోతమకూ అదే గతి పడుతుందని ఎమ్మెల్యే స్థాయి నేతలు  ఆందోళన చెందుతున్నారు.  దాసరికి జరిగిన అవమానం ప్రభావం పార్టీపై స్పష్టంగా కనపడేఅవకాశం ఉంది.
     

Advertisement
Advertisement