తల్లీ కూతుళ్లకు యావజ్జీవం | Sakshi
Sakshi News home page

తల్లీ కూతుళ్లకు యావజ్జీవం

Published Tue, Feb 4 2014 5:39 AM

Daughter, mother gets life imprisonment

గద్వాల, న్యూస్‌లైన్: సవతి పోరును తప్పించాలనే ప్రయత్నంలో హత్యకు పాల్పడిన ఓ కేసులో తల్లీకూతుళ్లకు యావజ్జీవ శిక్ష పడింది. తల్లి, కుమారునితో కలిసి పథకం ప్రకారం తన భర్త రెండో భార్య (సవతి)ని ఉరివేసి ఆత్మహత్యగా చి త్రీకరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలకు గద్వాల  కోర్టు సోమవారం యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చిం ది. అదనపు పీపీ వెంకటేష్‌గౌడ్ తెలిపిన సమాచారం మే రకు... గద్వాలలోని ధరూరుమెట్టు వీధిలో ఉంటున్న బొ గ్గుల ఆంజనేయులుకు ఇద్దరు భార్యలు.
 
 రెండో భార్యగా వ చ్చిన నాగవేణిని ఎలాగైనా తప్పించాలన్న ఆలోచనతో మొ దటి భార్య జయమ్మ, ఆమె తల్లి లక్ష్మి, జయమ్మ కుమారుడు అనిల్ ముగ్గురు కలిసి పథకం రచించారు. 14 ఆగస్టు 2012న ఇంట్లో భర్త లేని సమయంలో ఒంటరిగా ఉన్న నాగవేణి కి బలవంతంగా ఉరి తగిలించారు. చనిపోయిందనుకున్న వారు వదిలేసి ఇంట్లో లేనట్లుగా బయటకు వెళ్లిపోయారు. కిటికీలో నుంచి ఉరివేసిన నాగవేణిని ఇరుగు పొరుగు వారు చూసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్న ఆలోచనతో తలుపులు పగులగొట్టారు. అదే సమయంలో భర్త బొగ్గుల ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. ఉరి తాడు నుంచి నాగవేణిని దింపి ఆస్పత్రికి తరలించారు.
 
 గద్వాల ఆస్పత్రి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించగా, కర్నూలు ఆస్పత్రిలో 25 ఆగస్టు 2012 రోజున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, పథకం ప్రకారమే హత్య చేశారని నాగవేణి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు  కేసును విచారించి ఆంజనేయులు మొదటి భార్య జయమ్మ, ఆమె తల్లి లక్ష్మి, కుమారుడు అనిల్‌లు కలిసి ఉరి వేశారని చార్జిషీటు నమోదు చేయడంతోపాటు, అరెస్టు చేశారు.  అనిల్ మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు తరలించారు. గద్వాల అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జయమ్మ, లక్ష్మిలపై విచారణ చేపట్టి జయమ్మ, ఆమె తల్లి లక్ష్మిలే హత్యచేశారని    నిర్ధారించారు. దీంతో వారికి యావజ్జీవ జైలు శిక్షతోపాటు, *2వేల చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల మూడో  అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ప్రభాకర్  తీర్పు చెప్పారు.

Advertisement
Advertisement