'రైల్వే ఆసుపత్రి నుంచి మృతదేహలను కేజీహెచ్కు తరలించండి' | Sakshi
Sakshi News home page

'రైల్వే ఆసుపత్రి నుంచి మృతదేహలను కేజీహెచ్కు తరలించండి'

Published Sun, Nov 3 2013 12:13 PM

'రైల్వే ఆసుపత్రి నుంచి మృతదేహలను కేజీహెచ్కు తరలించండి' - Sakshi

గొట్లం రైలు ప్రమాద ఘటనలో మరణించిన ఎనిమిది మృతదేహలను రైల్వే ఆసుపత్రి నుంచి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర మంత్రి పి.బాలరాజు ఉన్నతాధికారులను ఆదివారం ఆదేశించారు. నిన్న రాత్రి విజయనగరం సమీపంలోని గొట్లంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతదేహలను ఆదివారం గుర్తించారు. అనంతరం ఆ మృతదేహలను విశాఖలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రిలో  ఫ్రీజింగ్ బాక్స్లు లేకపోవడం పట్ల మంత్రి బాలరాజు విస్మయం వక్యం చేశారు.

 

దాంతో బాలరాజు వెంటనే స్పందించి పైవిధంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయనగరం సమీపంలోని గొట్లంలో నిన్న రాత్రి జరిగిన రైల్వే ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోకరిని గుర్తించవలసి ఉంది. అయితే మృతుల్లో ఒక్కరే రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన ఇద్దరు క్షతగాత్రులు విశాఖపట్నంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
Advertisement