Sakshi News home page

డిసెంబర్ 10 వరకు ఓటర్ల నమోదు

Published Tue, Nov 19 2013 3:19 AM

December 10 to register voters

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూత న ఓటర్ల నమోదుకు దరఖాస్తులతోపాటు మార్పులు చేర్పులకు 6, 7, 8, 8 ఏ దరఖాస్తు లు సమర్పించవచ్చని చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం ప్రచురించామన్నారు. ఇందులో ఉన్న పొరపాట్లను సరి చేయాలన్నారు. ఈ నెల 24, డిసెంబర్ 1,8 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి బీఎల్‌వోలు క్లెయిమ్ లు స్వీకరిస్తారని చెప్పారు. ఆ క్లైయిమ్‌లతోపాటు ఇతర సమస్యలను డిసెంబర్ 28న పరిష్కరించాలన్నారు. 2014 జనవరి 10న మొత్తం వివరాలు అప్ లోడ్ చేసి సప్లిమెంటరీ జాబితా తయారు చేయాలని, 16న తుది  జాబితా ప్రచురించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలకు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామని వెల్లడించారు.
 
  పై-లీన్ తుపా ను, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాల వివరాలను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. రచ్చబండలో వచ్చే ఆర్జీల వివరాలను ప్రజావాణిలో నమోదు చేయాల న్నారు. 7వ విడత భూ పంపిణీని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టాతోపాటు టైటిల్ డీడ్, కంప్యూటరైజ్డ్ అడంగల్, వెబ్ అడంగల్, ఎఫ్‌ఎంబీ కాపీ అందించాలని స్పష్టం చేశారు. బంగారు తల్లి పథకం వర్తింపజేసేందుకు ఈ ఏడాది మే 1వ తేదీ తర్వాత జన్మించిన బాలికల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ తేదీ తర్వాత జిల్లాలో 16 వేల మంది జన్మించగా 3 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, వచ్చే సోమవారం నాటికి కనీసం 5 వేల మంది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
 
 నేడు టాయిలెట్ దినోత్సవం
 మంగళవారం టాయిలెట్ దినోత్సవం నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు ఇతర అంశాలపై చర్చించాలని సూచించారు.  డీఎంహెచ్‌ఓ గీతాంజలి, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement