బలహీనపడ్డ అల్పపీడనం | Sakshi
Sakshi News home page

బలహీనపడ్డ అల్పపీడనం

Published Fri, Jan 2 2015 12:43 AM

Declined over the

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. గురువారం మధ్యాహ్నం వరకు ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం సాయంత్రానికి బలహీనపడటంతో ప్రభావం తగ్గింది. దీంతో కోస్తాంధ్రలో ఈశాన్య దిశగా వీస్తున్న బలమైన ఈదురుగాలులు తగ్గుముఖం పట్టాయి.

ఈ గాలులు శుక్రవారానికి మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఆకాశంలో మేఘాలు ఆవరించి ఉన్నాయి. దీంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కోస్తాంధ్రలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 7, గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి.

తెలంగాణాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 7, గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు చొప్పున పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement
Advertisement