క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..! | Sakshi
Sakshi News home page

క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..!

Published Mon, Nov 17 2014 2:22 AM

క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..!

తిరుపతి నగరంలో 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీపండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎస్‌పీజేఎన్‌ఎం)లోని క్రీడామైదానం  మొదటిదిగా గుర్తింపు పొందింది.  ఈ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులు కూడా ఎదిగారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాఠశాల క్రీడామైదానంలోకి ప్రస్తుతం క్రీడాకారులకు ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించిన ఓ మున్సిపల్ అధికారి స్నేహితుడు వాకింగ్ చేయడానికి అంకితం ఇచ్చారు. క్రీడాకారులు ఎవరూ ప్రవేశించకుండా గేటుకు తాళం కూడా వేశారు.
 
తిరుపతి స్పోర్ట్స్ : తిరుపతి నగర కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి వాకింగ్ చేయాలనే కోర్కె తీర్చేందుకు శ్రీపండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని మైదానంలో లక్షలు ఖర్చుపెట్టి వాకింగ్ ట్రాక్  ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ దెబ్బతినకుండా, వాకింగ్ సమయంలో స్నేహితుడికి అసౌకర్యం లేకుండా ప్రహరీ నిర్మించి దానికి ఇనుప గేట్లు వేయించారు. ఈ గేటుకు తాళం వేసి, తాళాలను తన స్నేహితుడికి అందించినట్టు సమాచారం. దీంతో  మైదానంలోకి విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు సెలవు ఇచ్చిన రోజు ల్లో కూడా పాఠశాల విద్యార్థులు, క్రీడాకారు లు మైదానంలోకి వెళ్లలేక పోతున్నారు.

ఇదే మైదానంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ క్రికెట్ స్వేచ్ఛగా ఆడలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు క్రీడాకారులు ఎతైన ప్రహరీ గోడ, ఇనుప గేటు దూకి, కిందపడి గాయపడ్డారు. ఎవరైనా సా హసించి మైదానంలో ఆడుతుంటే బలవంతంగా వెళ్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం క్రీడాకారుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
క్రీడాకారులకు ఇబ్బందనీ...
విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే తాళాలు వేశాం. రోజూ సాయంత్రం కొంత సేపు విద్యార్థులకు క్రీడలను నేర్పించి తిరిగి తాళాలు వేస్తున్నాం. ఇతరులు లోనికి రాకుండా కట్టడి చేయచ్చు. ఇక మైదానంలో వాకింగ్ ట్రాక్ ఎవరి కోసం వేశారో నాకు తెలియదు.
 -రెడ్డెప్పరెడ్డి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం,ఎస్‌పీజేఎన్‌ఎం పాఠశాల. తిరుపతి

Advertisement
Advertisement