చంద్రబాబుకు ఓటమి భయం! | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓటమి భయం!

Published Wed, Nov 20 2013 3:12 AM

చంద్రబాబుకు ఓటమి భయం! - Sakshi

సాక్షి, చిత్తూరు, కుప్పం టౌన్: తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఓడిపోతానన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంపై ఆయన కుప్పంలో ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు రెండో రోజూ బిజీగా గడిపారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం నియోజకవర్గ తెలుగుదేశం సవున్వయ కమిటీ సవూవేశాన్ని నిర్వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయే పరిస్థితి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్గత సవూవేశాల్లో ఎవరైనా లేచి వూట్లాడితే.. ఏయ్ కూర్చో అనే చంద్రబాబు ఈ సవూవేశంలో మాత్రం స్వరం తగ్గించి వూట్లాడారు. ఇటీవల పంచాయుతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ 32 పంచాయుతీలను గెలుచుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో డెరైక్టర్లు, కుప్పం టౌన్ బ్యాంక్ డెరైక్టర్ పోస్టుల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ గెలవడంపై ఆరా తీశారు. తాము సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిందని, మీరేం చేస్తున్నారని టీడీపీ నాయుకులను ప్రశ్నించారు.
 
  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటనకు గ్రావూల నుంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. కాగా..  రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా, నీచంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను ఇష్టానుసారం కాకుండా అసెంబ్లీ తీర్మానం చేసి, పారదర్శకంగా చేయాలన్నారు. ఆ దిశగా ఒత్తిడి తేవాల్సిందిగా జాతీయ రాజకీయ పార్టీలకు మరోసారి లేఖ రాస్తానని వెల్లడించారు.  కాంగ్రెస్ మంత్రులే ఆర్టికల్ 371 డీని సవరించాలని ఒకసారి, వద్దని ఇంకోసారి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్‌ఐసీ మీటింగ్‌లో ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేస్తున్నారని తాను మాట్లాడితే.. ఆనాడు సీఎం కిరణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement