కాసులు కురిపిస్తున్న కందులు, మినుములు | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తున్న కందులు, మినుములు

Published Sat, Feb 15 2014 1:59 AM

demand price for red gram, black gram

మోర్తాడ్, న్యూస్‌లైన్ : మార్కెట్‌లో కందులు, మినుముల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నా యి. దీంతో ఈ పంటలు సాగుచేసిన రైతుల కు లాభాల పంట పండుతోంది. మన ప్రాం తంలో సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సీమాంధ్ర లో పంట నీటిపాలు కావడంతో మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ పెరిగింది. దీంతో కందులు, మినుములను సాగుచేసిన రైతులకు ఈ రెండు పంటలు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

 అంతర పంటగా సాగు...
 పసుపు, సజ్జ, ఎర్రజొన్న సాగుచేసే భూము ల్లో కంది పంటను అంతర్ పంటగానే రైతు లు సాగుచేస్తున్నారు. పంట పొలాల ఒడ్ల వెంబడి కంది పంటను సాగుచేయడం ఎం తో కాలంగా జరుగుతోంది. మినుము పం టను మాత్రం రైతులు ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు.బాల్కొండ,మోర్తాడ్,కమ్మర్‌పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి  మండలాల్లో కందులు, మినుములను రైతులు ఈ సీజనులో తక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు.

 ధరలిలా..
 గతంలో క్వింటాలు మినుములకు రూ.3 వేల ధర పలికింది. ఈ  ఏడాది ఏకంగా రూ.వెయ్యి ధర పెరిగింది. మినుములను నిజామాబాద్ మార్కెట్‌లోని వ్యాపారులు క్వింటాలుకు రూ.4 వేల ధర చెల్లిస్తున్నారు. కందులకు గతేడాది క్వింటాలుకు రూ.2,800 ధర లభించింది. ఈసారి క్వింటాలు కందులకు రూ.3 వేల నుం చి రూ.3,700 ధర పలుకుతోంది. రబీ సీజను లో కూడా పప్పు ధాన్యాలను సాగుచేసే వీలు ఉన్నా ఎక్కువ మంది రైతులు సజ్జ, ఎర్రజొన్న పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు. సజ్జ, ఎర్రజొన్న పంటలకు సీడ్ వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించడానికి గ్రామాలలో ధర ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు.


 దీంతో నిజామాబాద్ మార్కెట్‌కు విక్రయానికి తక్కువ పరిమాణంలో మినుములు, కందుల వస్తున్నాయి. మార్కెట్‌లో పప్పు ధాన్యాలకు ధర పెరగడంతో ముందు, ముందు పప్పుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులకు పప్పు ధాన్యాల మద్దతు ధరను ప్రభుత్వం పెంచిన కారణంగా పప్పుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కందులు, మినుములకు భారీగా ధర పలుకుతుండటంతో రైతులు వీటిని నిలువ ఉంచకుండానే విక్రయిస్తున్నారు. వ్యాపారులు పోటీపడి నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement