ధర్మవరంలో భూ మాఫియా | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో భూ మాఫియా

Published Mon, Oct 27 2014 1:52 AM

Dharmavaranlo land mafia

దర్మవరం : ధర్మవరంలో భూ మాఫియా చెలరేగుతోంది. సొంతదారు ప్రమేయం లేకుండా నకలీ పత్రాలు ృసష్టించి స్థలాలను అమ్మేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరానికి చెందిన వర్ధి నారాయణస్వామికి చంద్రబాబునగర్‌లోని సర్వే 35-1లో 12 సెంట్ల స్థంం ఉంది. పదేళ్ల క్రితం ఇక్కడ నుంచి ఆయన బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం డబ్బు అవసరమై తనకున్న 12 సెంట్ల స్థలాన్ని విక్రయించాలని అల్లుడికి పురమాయించాడు.

ఆ స్థలం వివరాలు కనుక్కునేందుకు రిజిస్టర్ కార్యాలయంలో ఈసీని తీయించి ఆయన పరిశీలించారు. అయితే ఆ స్థలం  వేరొకరికి విక్రయించినట్లు తేలింది. రిజిస్టర్ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని భూ మాఫియా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ప్లాట్ సర్వేనంబర్‌పై నకలు తీసుకుని యజమాని వివరాలతో ఓ అనామక వ్యక్తిని తీసుకువచ్చి విక్రయాలు చేసినట్లు వెలుగు చూసిం ది. 2009 సంవత్సరానికి ముందు రిజిస్టర్ చేసిన ఆస్తులకు సంబంధించి యజమాని పేరు మాత్రమే ఉంటుంది.   ఇదే అక్రమార్కుల పాలిట వరమైం ది. గొట్లూరికి చెందిన ఓ వ్యక్తిని వర్ధి నారాయణస్వామిగా చూపి 12 సెంట్ల స్థలంలో ఐదు సెంట్లను సెప్టెంబర్ 9న ఓ మహిళ పేరిట జీపీ చేయించారు. మిగిలిన ఏడు సెంట్ల స్థలాన్ని అక్టోబర్ 7న పట్టణంలోని ఓ వ్యక్తికి రూ. 10.17 లక్షల కు విక్రయించారు.

తొలుత ప్లాట్లను అమ్మివేయ డం, అసలు యజ మానులు వచ్చినప్పటికి ఎవరో ఒకరు రాజకీయ నాయకున్ని ఆశ్రయించడం సెటిల్‌మెంట్ చేసి సదరు యజమానులకు తృణమో, ఫణమో ముట్టచెప్పడం..కాదూ కూడదంటే వారిని బెదిరించి ఎంతో కొంత స్థలాన్ని లాక్కోవడం వంటి సంఘటనలు పట్టణంలో చాలా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా స్పందించి అక్రమార్కుల కొరఢా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement