తెలంగాణ బిల్లు-న్యాయపరమైన అంశాలపై చర్చ | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు-న్యాయపరమైన అంశాలపై చర్చ

Published Sun, Jan 26 2014 2:44 PM

జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేంద్ర, ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఈరోజు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్కు  నోటీసు ఇప్పించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని సీఎం పేర్కొన్నారు. శాసనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య ఇదే నోటీస్ ఇచ్చారు. టిడిపి కూడా ఇదే తరహా నోటీస్ ఇచ్చింది.  

ఈ నేపధ్యంలో బిల్లు తిప్పి పంపాలని  ఉభయ సభలలో సోమవారం  తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందువల్ల  ఈ తీర్మానం విషయంతోపాటు  న్యాయపరమైన అంశాలపై కూడా వారు సుదర్శన రెడ్డితో  చర్చిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement