* జిల్లాపై వివక్ష
* రాష్ట్రంలోనే అతితక్కువ పోస్టులు
* ఉసూరుమంటున్న డీఎస్సీ అభ్యర్థులు
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిందన్న ఆనందం జిల్లా అభ్యర్థుల్లో ఎక్కువసేపు నిలువలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ విడుదలలో సైతం తన సొంతజిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రతిపక్షనేత జిల్లా అయిన వైఎస్ఆర్ జిల్లాకు మాత్రం మొండిచేయి చూపారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 1606 పోస్టులు ఖాళీలుగా చూపగా, వైఎస్ఆర్ జిల్లాలో అత్యల్పంగా కేవలం 356 పోస్టులు మాత్రమే చూపారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేలాదిమంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లుచల్లినట్లైంది.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి నిరుద్యోగులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూనే వచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో పలుమార్లు మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు మాటతప్పారు. మొదటగా సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పి.. అనంతరం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు. దీంతో బీఈడీ అభ్యర్థులు సైతం తమని తప్పుదోవ పట్టించారన్న ఆగ్రహం వారిలోఉంది.
జిల్లాకు 356 పోస్టులు .
డీఎస్సీ నోటిఫికేషన్లో వైఎస్ఆర్ జిల్లాకు కేవలం 356 ఖాళీలు చూపారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 206, స్కూల్ అసిస్టెంట్ 104, లాంగ్వేజి పండిట్స్ 40, పీఈటీలు 6 మాత్రమే చూపారు. నోటిఫికేషన్లో తక్కువ ఖాళీలు చూపడం పట్ల జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న దాదాపు 30వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వేలాదిరూపాయలు వెచ్చించి ఇప్పటికే శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు సైతం పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆశలపై నీళ్లు..!
Published Fri, Nov 21 2014 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement