జిల్లా అభివృద్ధికి కోర్ గ్రూప్ ఏర్పాటు | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి కోర్ గ్రూప్ ఏర్పాటు

Published Thu, Jan 29 2015 1:02 AM

జిల్లా అభివృద్ధికి కోర్ గ్రూప్ ఏర్పాటు

స్పీకర్ కోడెల వెల్లడి
 
పాతగుంటూరు: అభివృద్ధి విషయంలో రాజధాని ప్రాంతమైన గుంటూరును ఆదర్శ జిల్లా గా నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కోర్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. బుధవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోర్ గ్రూపు మొదటి సమావేశం నిర్వహించామని చెప్పారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సమ గ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తునట్లు వివరించారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి ప్రధానాంశాలుగా ‘వాష్’ ప్రోగ్రామ్ రూపొందించామన్నారు.

పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆట స్థలం, ప్రహరీ, అదనపు గదుల నిర్మాణానికి, చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతల సహాయ సహాకారాలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థారుు ల్లో దాతలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు సామాజిక స్పృహ, నైతిక విలువలు నేర్పితే సమాజం బాగుపడుతుందన్నారు.

జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సహకారం అందించటానికి ఇస్కాన్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. దీంతో విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందుతుందని చెప్పారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు  చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్ గ్రూప్ సమావేశం అనంతరం ఇస్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, డీఈవో శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌పీడీ సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement