అబద్ధాల బాబును నమ్మకండి | Sakshi
Sakshi News home page

అబద్ధాల బాబును నమ్మకండి

Published Fri, Apr 4 2014 1:58 AM

అబద్ధాల బాబును నమ్మకండి - Sakshi

కౌతాళం, న్యూస్‌లైన్ : ఎలాగైనా అధికారంలోకి  రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులు ఆచరణ సాధ్యంకానీ హామీలతోపాటు లేనిపోని మాటలు చెబుతున్నారని, వారిని మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రజలకు సూచించారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పాటుపడుతున్న వైఎస్సార్‌సీపీకి ఆదరించి అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు.
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉరుకుందలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు నేర్చుకున్నాడని, అలాంటి వ్యక్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన మహా ఘనుడని విమర్శించారు. ఇప్పటి వరకు హామీలు ఇస్తున్నారు తప్పితే మొదటి సంతకం ఫలానా ఫైలుపై పెడతానని కచ్చితంగా చెప్పలేని అయోమయ స్థితిలో ఆయన ఉన్నారన్నారు.
 
నియోజకవర్గంలో ఆ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉందని, అలాంటిది తిక్కారెడ్డి మొన్న ఆ పార్టీలో చేరి అప్పుడే తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రేడియో మెకానిక్‌గా కాలం వెళ్లదీసిన ఆయన నేడు రూ.50 లక్షల కారులో తిరుగుతున్నాడంటే ప్రజలను ఏ స్థాయిలో మోసం చేశాడో అర్థం చేసుకోవచ్చన్నారు. సారా, లిక్కర్ సంపాదన, నిధులు తీస్తానంటూ ప్రజల్ని మోసం చేసిన సంఘటనలను జనం మరిచిపోలేదన్నారు.

తమకు పూర్వీకుల నుంచి ఆస్తులున్నాయని, ప్రజలకు ఇవ్వడం తప్ప దోచుకోవడం తమ కుటుంబానికి తెలియదన్నారు. ప్రజల పక్షాన నిలిచి నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి సమస్యలు తెలుసుకున్న రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
 
వరుసగా అన్ని  ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఉరుకుంద, ఓబుళాపురం, చిరుతపల్లి, మల్లనహట్టి, కరిణి, తిప్పలదొడ్డి, చూడి, వల్లూరు, గుడికంబాలి, హాల్విలో ప్రచారం నిర్వహిం చారు. జిల్లా అడహక్ కమిటీ సభ్యుడు అత్రితనయగౌడు, మండల క న్వీనరు నాగరాజ్‌గౌడు, పలువురు నాయకలుపాల్గొన్నారు.

Advertisement
Advertisement