రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం

Published Thu, May 22 2014 10:01 AM

EAMCET exam begin statewide

హైదరాబాద్ :  రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అగ్రికల్చర్-మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల జరగనున్నాయి.  ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 3,95,650 మంది విద్యార్థులు ఎంసెట్కు దరఖాస్తు చేయగా,  ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,82,799 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 1,12,851 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్  పరీక్షకు 523 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 227 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కాగా ఇంజినీరింగ్ పరీక్షకు 'క్యూ' కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను ఎంసెట్ట్ పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని తెలిపారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఓ గంట ముందే రావాలని సూచించారు. ఈ నెల 24న ప్రాథమిక కీ విడుదల కానుంది. 31 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 9న ఎంసెట్ ర్యాంకులు విడుదల  చేస్తారు.

 

Advertisement
Advertisement