ఈసీ సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక | Sakshi
Sakshi News home page

ఈసీ సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక

Published Sun, Aug 25 2013 3:13 AM

Easy choice of the convention registrar

గుడుపల్లె, న్యూస్‌లైన్: ద్రవిడ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక జరుగుతుందని, అంతవరకూ గవర్నర్ ఆదేశం మేరకు డెప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న మాధవనాయుడు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారని వైస్‌చాన్స్‌లర్ ఆచార్య కంకణాల రత్నయ్య స్పష్టంచేశారు. శనివారం వీసీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీకాలం ఈ నెల 22న ముగిసిందని, ఈ నేపధ్యంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌ను నియమించాలని ఈనెల 6వ తేదీన గవర్నర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని వీసీ వివరించారు.

గవర్నర్ ఆదేశం మేరకు 23 నుంచి ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టాలని డెప్యూటీ రిజిస్ట్రార్‌ను ఈ నెల 7వ తేదీనే ఆదేశించామని చెప్పారు. ఇదిఇలా ఉండగా రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీ కాలాన్ని పొడిగించేలా ఈసీ కమిటీలో ప్రతిపాదించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా లేఖరాశారని, కానీ అది ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ కాదని వీసీ రత్నయ్య వివరించారు. ద్రవిడ వర్సిటీకి ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) నియమించలేదని చెప్పారు.

కమిటీ నియమించేవరకూ రాష్ర్ట ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్  కార్యదర్శి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్  కార్యదర్శి సాంబశివరావు, విద్యాశాఖ కొలిజియేట్ ఆఫ్ కమిషనర్ సునీతతో పాటు తమిళనాడుకు చెందిన ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శ్రీ రాజరాంలు ద్రవిడ వర్సిటీకి ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా వైస్‌చాన్స్‌లర్ ఉంటారన్నారు.

ఎక్స్‌అఫిషియో సభ్యులందరూ రిజిస్ట్రార్ పోస్టు ఫలానావారికి ఇవ్వాలని ప్రతిపాదించినా కూడా వీసీ ఒప్పుకుంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటయ్యాక సమావేశం ఏర్పాటుచేసి నూతన రిజిస్ట్రార్‌ను నియుమిస్తావుని చెప్పారు. అప్పటివరకు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా వూధవనాయుుడు కొనసాగుతారని వివరించారు.
 

Advertisement
Advertisement