70 ఏళ్లు దాటినా పింఛన్‌ ఇవ్వడం లేదు | Sakshi
Sakshi News home page

70 ఏళ్లు దాటినా పింఛన్‌ ఇవ్వడం లేదు

Published Thu, Apr 26 2018 7:27 AM

Elderly Woman Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా: ‘అయ్యా.. వృద్ధాప్య పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మంజూరు చేయడం లేదు’ అంటూ ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన షేక్‌ మౌలాబీ, షేక్‌ పకీర్‌సాయిబ్, షేక్‌ మస్తాన్‌వలి, షేక్‌ కరిముల్లాతో పాటు మరికొంత మంది మహిళలు ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లు దాటిన తమకు రేషన్‌ కార్డులో, ఆధార్‌ కార్డులో వయస్సు తప్పుగా పడడంతో మూడున్నరేళ్లుగా పింఛన్‌ ఇవ్వకుండా నరకయాతన పెడుతున్నారని వాపోయారు. నిబంధనలు సడలించి తమకు పింఛన్లు మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలని జననేతను కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement