కిడ్నీ వ్యాధి తినేస్తోంది.. | Sakshi
Sakshi News home page

కిడ్నీ వ్యాధి తినేస్తోంది..

Published Thu, Dec 6 2018 7:28 AM

Elderly Women Meets YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం :‘భయ్యా.. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం నెలకు 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు’ అంటూ జి.సిగడాం మండలం మెట్టవలసకు చెందిన షయ్యర్‌ ప్యారీ జగన్‌ వద్ద కన్నీరు పెట్టుకున్నారు. విశాఖ వరకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు కొనాల్సి వస్తోందని చెప్పారు. దీని వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని, మీరైనా ఆదుకోవాలని కోరారు.  

 డీఎస్సీ పేరుతో మోసం
‘అన్నా.. డీఎస్సీ పేరుతో టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. జిల్లాలో ఎస్‌జీటీ ఖాళీల సంఖ్య 750 ఉంటే కేవలం 150 పోస్టులతో నోటిఫికేషన్‌ వేశారు’ అంటూ పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన గురుగుబిల్లి నర్సింగరావు జగన్‌కు చెప్పారు. డీఈడీ అభ్యర్థులకు పోస్టులు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వ నిర్ణయంతో పోస్టులు తగ్గిపోయాయని తెలిపారు. మీరు సీఎం అయ్యాక న్యాయం చేయాలని కోరారు.  

 కమిటీల ఆగడాలు
‘మా మండలంలో జన్మభూమి కమిటీలు అ ర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెం దిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నారు’ అని దవళపేట గ్రామానికి చెందిన నూక చంద్రశేఖర్‌ జగన్‌కు చెప్పారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను కూడా తొలగించారని ఫిర్యాదు చేశా రు. దవళపేట, ఆబోదులపేట, మర్రివలస ఇలా చాలా గ్రామాలకు దశాబ్దాలుగా రహదారులు లేవని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement