అతివదే అగ్రస్థానం | Sakshi
Sakshi News home page

అతివదే అగ్రస్థానం

Published Sun, Feb 2 2014 1:57 AM

eluru constituency women voters Highest

 ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లా నాయకుల భవితవ్యం తమ చేతుల్లోనే ఉందనే విషయూన్ని అతివలు మరోసారి తేల్చి చెప్పారు. ఓటర్ల నమోదులో ఈసారి కూడా మన జిల్లా మహిళలు అధిక్యతను కొనసాగించారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 35వేల 952మంది ఉన్నట్లు 2014 ఓటర్ల గణాం కాలు స్పష్టం చేశాయి. ఒక్క గోపాలపురం నియోజకవర్గం మినహా.. 14 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం కావటం విశే షం. అధిక శాతం యువతీ యువకులు సైతం ఓటుహక్కు పొందారు.ఎన్నికల సంఘం జారీ చేసిన తుది ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే... జిల్లాలో మొత్తం ఓట ర్లు 28లక్షల 12వేల 472 మంది కాగా, వారిలో మహిళలు 14లక్షల 24వేల 212 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 13లక్షల 88వేల 260 మందిగా లెక్క తేలారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గంగా చింతలపూడి రికార్డు దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 30వేల 029 మంది కాగా, పురుషులు 1లక్షా 14వేల 741 మంది. మహిళలు 1లక్షా 15వేల 288 మంది ఉన్నారు. రెండు, మూడు స్ధానాల్లో తణుకు, భీమవరం నియోజకవర్గాలు నిలిచాయి. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న నియోజకవర్గంగా నరసాపురం నిలిచింది. 
 
 జాబితాల ప్రదర్శన
 జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. తుది ఫొటో ఓటరు జాబితాలు శనివారం జిల్లాకు చేరాయి. అధికారులు వాటిని హడావుడిగా పోలింగ్  కేంద్రాలకు తరలించారు. ఓటర్ల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. జిల్లాకు వచ్చిన 13వేల 151 కొత్త ఓటరు గుర్తింపు కార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేసేందుకు సన్నద్ధమయ్యూరు. 
 
 యువత జోష్
 ఓటు హక్కు పొందటం ద్వారా ప్రజాప్రతినిధుల జాతకాలను మార్చేందుకు యువత రంగంలోకి దిగింది. గత ఏడాది ఓటర్ల నమోదు సందర్భంగా 28 వేల మంది యువతీ యువకులు నమోదయ్యూరు. ఈసారి 18-19 సంవత్సరాల మధ్య వయసు గలవారు 73వేల 329 మంది ఓటర్లుగా నమోదయ్యూరు. సగటున ప్రతి నియోజకవర్గంలోను ఐదు వేల మంది యువ ఓటర్లు నమోదయ్యూరు. వీరిలో సగం మంది కార్యాలయాల జోలికి వెళ్లలేదు. ఆన్‌లైన్ ద్వారా ఓటర్లుగా నమోదయ్యూరు. 
 
 వయసుల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా...
 ఈసారి ఓటర్లను వయసుల వారీగా లెక్కతేల్చారు. యువ ఓటర్ల సంఖ్యను తెలుసుకునేందుకే ఇలా చేశారని సమాచారం. అయితే ఏ నియోజకవర్గంలో ఎంత మంది యువ ఓటర్లు ఉన్నారనేది అధికారులు బయట పెట్టడం లేదు. సూత్రప్రాయంగా సంఖ్యలను చెప్పటం విమర్శలకు తావిచ్చింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 73,329 మంది, 20-29 వయసువారు 7లక్షల 64వేల 994 మంది ఉన్నారు. 30-39 ఏళ్ల వారు 6లక్షల 97వేల 314 మంది కాగా, 40-49 ఏళ్ల వారు 5లక్షల 44వేల 653 మంది ఉన్నారు. 50-59 ఏళ్ల వారు 3లక్షల 80వేల 741 మంది, 60-69 ఏళ్ల వారు 2లక్షల 23వేల 184 మంది, 70-79 ఏళ్ల వారు 1లక్షా 06వేల 187 మంది, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 22,070 మంది ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. 2013 నవంబర్ 18 నాటికి నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల సంఖ్య, జనవరి 31న ఖరారు చేసిన ఓటర్ల సంఖ్యలను పక్క పట్టికల్లో చూడవచ్చు.
 

 

Advertisement
Advertisement