ఎంపేడులో ఎన్నాళ్లీ దౌర్జన్యం? | Sakshi
Sakshi News home page

ఎంపేడులో ఎన్నాళ్లీ దౌర్జన్యం?

Published Thu, Apr 24 2014 4:19 AM

ఎంపేడులో ఎన్నాళ్లీ దౌర్జన్యం? - Sakshi

  •     ఎస్సీలపై కొనసాగుతున్న టీడీపీ దాడులు
  •      30 ఏళ్లుగా వారినిఓటు వేయనివ్వని వైనం
  •      విచారించేందుకు వెళ్లిన ‘సాక్షి’ టీవీ కంట్రిబ్యూటర్‌పై దాడి
  •      ఎస్సీల మామిడి తోటలకు నిప్పు
  •      అక్కడ జీవించాలంటేనే భయపడుతున్న ఎస్సీలు
  •  సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు గ్రామం ఎస్సీ కాలనీవాసులపై కొన్ని సంవత్సరాలుగా స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక్కడ వారు చెప్పిందే వేదం. ఓ మాజీ ఎమ్మెల్యే తమ్ముడి దౌర్జన్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా తమ్ముడు మాత్రం టీడీపీలో ఈ గ్రామంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు.
     మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గ్రామంలోని దళితులకు చెందిన భూమిని సీఎల్‌డీపీ (కమ్యూనిటీ ల్యాండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కింద అభివృద్ధి చేశారు.

    ఆ తరువాత 120 కుటుంబాలకు చెందిన దళితులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా230 ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఈ ఎస్సీ కాలనీ వాసులు ఇటీవల టీడీపీ నుంచి వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఇంతకాలం తమ ఓట్లను టీడీపీ వాళ్లే వేసుకుంటున్నారని ఇకపై దీనిని సాగనివ్వమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు దళితుల మామిడితోటలకు ఈనెల 21న నిప్పు పెట్టారు. 150 ఎకరాల్లో మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ నేపథ్యంలో ఎస్సీ కాలనీకి కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ టీవీ కంట్రిబ్యూటర్ శంకర్‌రెడ్డిపై ఈ గ్రామానికి చెందిన తాటిపర్తి ఈశ్వర్‌రెడ్డి, ఆయన కుమారుడు, సింగిల్‌విండో అధ్యక్షుడు తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి దాడి చేశారు. శంకర్‌రెడ్డి తనపై జరిగిన దాడిని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు‘సాక్షి’కి సమాచారం చెబుతుండగా తమపై కూడా దౌర్జన్యం చేసి కొట్టారంటూ కొందరు ఎస్సీలు ఈశ్వర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డిపై కేసు పెట్టారు. మొదటి నుంచీ ఎంపేడు గ్రామం అత్యంత సమస్యాత్మకమైనదిగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
     
    ఎస్సీలపై పెరుగుతున్న దౌర్జన్యం
     
    సుమారు 30 సంవత్సరాలుగా తమ ఓట్లు టీడీపీ వారే వేసుకుంటున్నారని చెప్పిన ఎస్సీలపై దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కాలనీకి వేరే పార్టీల వారు ఎవరు ప్రచారానికి వెళ్లినా అక్కడి వారు ‘‘అన్నా ఇక్కడి నుంచి వె ళ్లిపోండి.. టీడీపీ వాళ్లు చూస్తే మిమ్మల్ని కొడతారు. మమ్మల్ని కూడా తర్వాత కొడతారు’’ అంటూ కాలనీవాసులు బతిమాలుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇటీవల ఈ గ్రామంలో ప్రచారం చేసేందుకు వెళ్లిన కే.మోహన్‌రెడ్డి, నేతాజీ, వంశీ, భాస్కర్‌రెడ్డి, రాజారెడ్డి అక్కడి పరిస్థితిని చూసి ఆందోళన చెం దారు. ఎంపేడు గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ గ్రామంలో టీడీపీ దౌర్జన్యాన్ని కే.మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
     స్పందించని సిబ్బంది
     
    ఎంపేడు గ్రామంలో ఇంతటి దౌర్జన్యకాండ జరుగుతు న్నా ఉన్నతాధికారులు ఇంతవరకు పట్టించుకున్న దాఖ లాలు లేవు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు, ఆ తరువాత కూడా పికెట్ కొనసాగించాల్సి ఉంది. స్థానికులపై దౌర్జన్యం చేస్తున్నందున వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
     
     నిర్భయంగా ఓటేసేలా చూడండి
     రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము నిర్భయుంగా ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. ఇంతవరకు వూ ఎస్సీకాలనీలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసిన దాఖలాలు లేవు. టీడీపీ వ్యక్తులు మమ్మలను ఓటు వేయునీయుడంలేదు. ఈ ఎన్నికల్లోనైనా ఓటును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
     - పాదం ఈశ్వర్, ఎంపేడు ఎస్సీ కాలనీ
     
     ఓటు వేయనివ్వలేదు
     స్థానిక సంస్థల ఎన్నికల్లో నన్ను టీడీపీకి చెందిన ఈశ్వరరెడ్డి అనుచరులు ఓటు వేయనివ్వలేదు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి బ్యాలెట్ పత్రాన్ని తీసుకున్నాను. వెంటనే నా వద్ద నుంచి టీడీపీ నాయుకులు లాక్కుని వాళ్లే ఓటేసుకుని బాక్స్‌లో వేసుకున్నారు. 35 ఏళ్లుగా నేను ఓటు హక్కును వినియోగించుకోలేదు.
     -నెల్లూరు గిరిజ, ఎంపేడు ఎస్సీకాలనీ


     పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి
     ఎంపేడు ఎస్సీకాలనీలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయూలి. పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా పోలీసు బలగాలను సైతం ఏర్పాటు చేస్తేనే మేవుందరం స్వేచ్ఛగా ఓట్లేసుకుంటాం. లేకుంటే టీడీపీ నాయుకులు వూపై దాడులు చేస్తారు.
     - బాపన పద్మావతి, ఎంపేడు ఎస్సీకాలనీ
     
     టీడీపీ నాయుకులను రానీయుకండి

     పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్దకు వూ గ్రావూనికి చెందిన టీడీపీ నాయుకులను రానీయుకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మేవుందరం గ్రావుంలోకి వెళ్లి ఓట్లేయుడంతో టీడీపీ నాయుకులు వూపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎస్సీకాలనీలో ఈ సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయూలి.
     - బుడదాటి సుబ్రవుణ్యం, ఎంపేడు ఎస్సీకాలనీ,  శ్రీకాళహస్తి రూరల్
     

Advertisement
Advertisement