జూన్ 8 నుంచి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ | Sakshi
Sakshi News home page

జూన్ 8 నుంచి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ

Published Fri, May 20 2016 6:07 PM

employee jac leaders meet ap cm chandrababu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో వచ్చే జూన్ 8 నుంచి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభించి 15వ తేదీలోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబుతో శుక్రవారం ఉద్యోగ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేసే 15వేలమంది ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలన్న అభ్యర్థనను పరిశీలించి త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ వేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకునేలా ప్రైవేట్ సంస్థలతో పోటీపడి ఉత్పాదకత పెంచేలా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల్ని బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా నియమించేందుకు ఆంధ్రబ్యాంక్ ముందుకొచ్చింది. 27 వేలమంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అయ్యే అవకాశముంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు కలిశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.

Advertisement
Advertisement